ఈ ఏడాది వేసవి కాలంలో వచ్చిన చివరి భారీ సినిమా సర్కారు వారి పాట.తొలుత ఈ చిత్రానికి రివ్యూ లు, ప్రేక్షకుల నుంచి కాస్త మిశ్రమ స్పందన లభించినా కలెక్షన్ ల వరకూ మహేష్ స్టార్ డం సినిమాని కాపాడింది అనే చెప్పాలి.
జూన్ 2 న అమెజాన్ ప్రైమ్ లో పే పర్ వ్యూ మోడ్ లో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా ఈ వారం పూర్తిగా ప్రెక్షుకల అందుబాటులోకి రాబోతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మరో మూడు భాషల్లో రిలీజ్ చేయటం.
తెలుగుతో పాటు తమిళ,కన్నడ,మలయాళం లోనూ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా ప్రైమ్ లో అందుబాటు లోకి రానుంది. వాస్తవానికి తమిళనాడులో మహేష్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ద్విభాషా చిత్రంగా ధియేటర్ లలో రిలీజ్ చేయడానికి మైత్రి మేకర్స్ ప్రయత్నించింది.
అయితే షూటింగ్ పలు మార్లు కరోనా మరియు ఇతర అవాంతరాల వలన ఆలస్యం అవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఇలా దక్షిణ భాషలన్నిట్లో సినిమా విడుదల అవడం ఆయా భాషల్లో ఉన్న మహేష్ అభిమానులు ఆనందించే విషయమే. అలాగే రాజమౌళి తో మహేష్ చేయబోయే పాన్ ఇండియా చిత్రానికి, ఇతర భాషా ప్రేక్షకులకు మహేష్ దగ్గర అవడానికి ఇదొక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు. ధియేటర్ లలో సందడి చేసినట్టే సర్కారు వారి పాట సినిమా ఓటిటీ లోనూ గట్టి ప్రజాదరణ పొందుతుంది అని ఆశిద్దాం.