SSMB28 టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటి. 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. టాలీవుడ్ అభిమానుల హృదయాల్లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సినిమాలోని అన్ని అంశాలు కూడా అత్యుత్తమ నాణ్యతతో వచ్చేలా యూనిట్ మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షూటింగ్ షెడ్యూల్ గత నెలలో ప్రారంభమైంది. కాగా ఈ షెడ్యుల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. ఐతే కొన్ని కారణాల వల్ల, ఆ షూటింగ్ ను కేవలం 6 రోజులలోనే ముగించి, చిత్ర బృందం విరామం తీసుకున్నారు. ఈ విరామం తర్వాత మహేష్ తన తల్లి మరణం రూపంలో భారీ వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నారు. మరి ఆ బాధ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా.
తాజాగా ఈ సినిమా షూటింగుకు సంభందించిన రెండో షెడ్యూల్‌ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ భారీ షెడ్యూల్ జరగనుండడంతో పాటు భారీ సెట్‌ను కూడా నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నారు. ఇక ఈ షెడ్యూల్‌లో వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాని నిర్మిస్తోంది. SSMB28 సినిమాకి SS థమన్ సంగీతం సమకూర్చనుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు.