Home సినిమా వార్తలు Superstar Mahesh Babu: యూకే ట్రిప్ వెళ్ళనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

Superstar Mahesh Babu: యూకే ట్రిప్ వెళ్ళనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

మహేష్ బాబు డిసెంబర్ 22న UKకి వెళ్లనున్నారు, సంక్రాంతి వరకు ఖాళీ సమయం ఉన్నందున, ఆలోగా ఆయన తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపాలనుకుంటున్నారట. ఇక ఆ తర్వాత SSMB28 షూటింగ్ సంక్రాంతి పండగ తర్వాత ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కాగా ఈసారి జరగబోయే షెడ్యూల్ చాలా పెద్దది అని అంటున్నారు.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకునేలా జాగర్తలు తీసుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. ఆయన తనకి ఇష్టమైన గమ్యస్థానమైన దుబాయ్‌లో అలాంటి ఉత్తేజకరమైన పార్టీలను జరుపుకోవడానికి ఇష్టపడతాడరు. ఈ వేడుకకు ఆయన బంధువులు కూడా హాజరవుతారు.

గతేడాది దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కూడా దుబాయ్ వేడుకల సందర్భంగా మహేష్ ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి పార్టీతో ప్రారంభమై జనవరి మొదటి వారంలో ఇరు కుటుంబాలు వేడుకలను దుబాయ్‌లో జరుపుకున్నాయి.

ఈసారి మహేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలిడేకి వెళ్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

మహేష్ ఈ ఏడాది తన ఇంట్లో ముగ్గురు ప్రియమైన వారిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అందువల్ల డిసెంబర్ 31 వేడుకలతో సహా జనవరి మొదటి వారంలో హాలిడే ప్లాన్ లేదనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ మహేష్ యూకే ట్రిప్ కన్ఫర్మ్ అవడంతో ఆ పుకార్లు అన్నీ వట్టి గాలి మాటలు అని తేలిపోయింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version