Homeసినిమా వార్తలుసరికొత్త టెక్నాలజీతో రి రిలీజ్ కానున్న స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ సింహాసనం

సరికొత్త టెక్నాలజీతో రి రిలీజ్ కానున్న స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ సింహాసనం

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో లేటెస్ట్ రి రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మరో సినిమా కొత్తగా తెరపైకి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సింహాసనం (1986) ఇప్పుడు వచ్చే ఏడాది ఆయన పుట్టినరోజు నాడు తిరిగి విడుదల కానుంది. విశేషమేమిటంటే ఈ చిత్రం మునుపెన్నడూ లేని విధంగా.. అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఏ సినిమాకి రాని విధంగా.. 8k టెక్నాలజీతో విడుదల కానుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 8K వెర్షన్ ను పునరుద్ధరించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం డాల్బీ సౌండ్‌లో కూడా విడుదల కానుంది.

యాదృచ్ఛికంగా, సింహాసనం సినిమా సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా.. అంతే కాకుండా ఆ సినిమాకి రచనతో పాటు నిర్మాణ భాద్యతలు కూడా ఆయనే నిర్వర్తించడం విశేషం. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన సింహాసనం.. తెలుగు సినిమా చరిత్రలో మొదటి 70 mm 4 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ తో వచ్చిన సినిమా. సింహాసనం చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జయప్రద, రాధ మరియు మందాకిని కూడా నటించారు. అంతే కాకుండా 1986లోనే హిందీలో ఏకకాలంలో విడుదల అయింది. అంటే అప్పట్లోనే ప్యాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఖచ్చితంగా సింహాసనం సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలా అభిమానులకు, ప్రేక్షకులకు ఇష్టమైన పాత సినిమాలను ప్రదర్శించే ఈ ట్రెండ్ నిజంగా చాలా మంచిది అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో ఈ చిత్రాలను చూడలేకపోయిన ప్రేక్షకులకు, అలానే పాత సినిమాలు అంతగా పరిచయం లేని చాలా మంది ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభవాన్ని ఇస్తుంది.

READ  తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న సూర్య - దేవిశ్రీప్రసాద్ కాంబో

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా సినిమాల తర్వాత స్టార్ పుట్టినరోజుల కోసం సినిమాలను ప్రదర్శించే కొత్త ట్రెండ్ మొదలైంది. అలాగే వచ్చే నెల ప్రభాస్ పుట్టిన రోజుకి ‘బిల్లా’, ‘ఛత్రపతి’ సినిమాలను మళ్లీ విడుదల చేసే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories