Home సినిమా వార్తలు Superhit was a Dream for Varuntej వరుణ్ తేజ్ కి సూపర్ హిట్ ఇక...

Superhit was a Dream for Varuntej వరుణ్ తేజ్ కి సూపర్ హిట్ ఇక కలేనా ?

matka

టాలీవుడ్ యంగ్ యాక్టర్ వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేదు. ముఖ్యంగా అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచి ఆయనకు కెరీర్ పరంగా దెబ్బేసాయి. ఇక తాజాగా మట్కా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు వరుణ్ తేజ్.

టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది మట్కా మూవీ. కాగా ఈ మూవీని కరుణ కుమార్ తెరకెక్కించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ మాత్రం ఎంతో బాగా పాత్రలో ఒదిగిపోయి నటించినప్పటికీ ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలు ఆడియన్స్ కి బోర్ కొట్టించాయి.

అలానే గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఒక్కటి కూడా లేకపోవడం తో పాటు పేలవమైన స్క్రీన్ ప్లే, ఎందుకు వస్తున్నాయో తెలియని సాంగ్స్ మూవీకి మైనస్. వాస్తవానికి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానిని స్క్రీన్ పై ఆడియన్స్ అలరించేలా తీయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. మట్కా తో మరొక ఫ్లాప్ వరుణ్ ఖాతాలో పడింది. కాగా వరుణ్ తేజ్ కెరీర్ లో సూపర్ హిట్ అనేది కలేనా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version