సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. సినిమాల షూటింగ్లతో ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఏడాదిలో తన కుటుంబంతో కలిసి కనీసం రెండు సార్లైనా ఆయన విహార యాత్రలకు వెళ్తుంటారు. అంతే కాకుండా ఆ సమయంలో కుటుంబంతో గడిపిన క్షణాలను ఫోటోల రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుంటూ ఉంటారు.తాజాగా మహేష్ బాబు తన భార్యా పిల్లలతో కలసి స్విట్జర్లాండ్లో విహార యాత్రలో ఉన్నారు .
అయితే అక్కడి నుంచి లైవ్ ఫోటోలను నమ్రత షేర్ చేస్తున్నారు. వీటిలో మహేష్ న్యూ గెటప్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహేష్ ఎప్పుడూ క్లీన్ షేవ్ లుక్ లో ఉంటారు. అందువల్లే ఆయన నవ్వినప్పుడు ఆ అందం మరింత రెట్టింపు అవుతుంది. అయితే స్విట్జర్లాండ్ యాత్రలో మహేష్ తన లుక్ ని పూర్తిగా మార్చుకుని కనిపించారు.
మంగళవారం మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ అరుదైన ఫోటోని షేర్ చేయగా.. క్షణాల్లో ఆ ఫోటో వైరల్ గా మారింది. అందమైన స్విట్జర్లాండ్ వీధుల్లో విహరిస్తున్న మహేష్, నమ్రతతో కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా ఈ ఫోటోకి కెమెరా వర్క్ చేసింది మహేష్ బాబు తనయుడు గౌతమ్ అట.
ఇక ఈ ఫోటోని చూసి మహేష్ బాబు అభిమానులు ఆనందంతో ఆ ఫోటోను షేర్ చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తదుపరి చేయబోయే చిత్రంలో మహేష్ ఈ లుక్ లోనే చూడాలి అని కోరుకుంటున్నాం అని కొందరు అంటుంటే.. వావ్ ఈ లుక్ సూపర్బ్ అంటూ మరి కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు.
ఈ విహార యాత్రలు పక్కన పెడితే మహేష్ బాబు త దుపరి చిత్రం ఆయనకు ఎంతో ఆప్తుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి SSMB28 గా పిలవబడుతున్న ఈ చిత్రం, ఈ ఏడాది ఆగస్టులో చిత్రీకరణ మొదలు పెట్టనుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసిన తరువాత RRR తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించే పాన్-ఇండియా సినిమాతో మహేష్ బాబు నటించనున్నారు. కాగా ఈ చిత్రంతో తొలిసారి ప్యాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు మహేష్. మరి ఈ చిత్రంతో మహేష్ – రాజమౌళి కలిసి ఎన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలి.