గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020లో కరోనా ప్యాన్డేమిక్ దాడి చేసినప్పటి నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మరణించారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా కొంత మంది మరణిస్తే.. మరి కొంత మంది ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించారు.అయితే.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి గారు మరణించారు.
ఆవిడ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆమె ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు మరణించారని సమాచారం.
సెప్టెంబర్ 26న ఇందిరా దేవి గారి ఆరోగ్యం విషమించడంతో AIG హాస్పిటల్స్ లో చేర్చారు.. ఆవిడకి ఎమెర్జెనీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స చేసిన తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యలు చెప్పారు.. ఆమె పరిస్థితిని అబ్జర్వేషన్ లో ఉంచామని, త్వరలోనే పూర్తి వివరాలను తెలుపుతామని డాక్టర్లు చెప్పారు. అయితే ఇంత తొందరలోనే ఆవిడ ప్రాణాలు కోల్పోతారని ఎవరూ ఊహించి ఉండరు.
ఇందిరమ్మ, కృష్ణ గారిని 1961 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. మహేష్ బాబు తో పాటు రమేష్ బాబు మరియు మంజుల కి జన్మనిచ్చారు ఇందిరమ్మ గారు.. ఇక ఆ తర్వాత కృష్ణ గారు 1969 సంవత్సరం లో విజయ నిర్మల గారిని రెండవ పెళ్లి చేసుకున్నారు.. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరమ్మ గారితో దాంపత్య జీవితం కొనసాగించారు కృష్ణ గారు.. విజయ నిర్మల గారు కృష్ణ గారి సినిమాల వ్యవహారాలు మరియు కృష్ణ గారికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు.. విజయ నిర్మల గారు 2019 వ సంవత్సరంలో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.
ఇక మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.. తన తల్లి గురించి ఎప్పుడు మాట్లాడినా మహేష్ బాబు కళ్ళలో నీళ్లు తిరగడం చూస్తూ ఉంటాము..ఆయనకి తన తల్లి గారితో ఉన్న అనుబంధం అలాంటిది. ప్రస్తుతం ఆయన తల్లి గారి మరణ వార్త విని అభిమానులే తట్టుకోలేకపోతున్నారంటే ఇక స్వయంగా కన్న కొడుకైన మహేష్ ఎంత బాధలో ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం.
ఇందిరమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. ఈ విషాద సమయంలో మహేష్ బాబు, కృష్ణ, మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తొందరలోనే వారు ఈ బాధలో నుంచి కోలుకోవాలని కోరుకుందాం.