Homeసినిమా వార్తలుSuper Response for The Paradise Glimpse Teaser 'ది ప్యారడైజ్' టీజర్ కి సూపర్...

Super Response for The Paradise Glimpse Teaser ‘ది ప్యారడైజ్’ టీజర్ కి సూపర్ రెస్పాన్స్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3 చేస్తున్నారు. మే 1న ఇది గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

అయితే దీని అనంతరం తాజగా దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తన నెక్స్ట్ మూవీ కమిట్ అయ్యారు నాని. ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మించనుండగా అనిరుద్ సంగీతం సమకూర్చనున్నారు. అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ మూవీకి ది ప్యారడైజ్ టైటిల్ ఫిక్స్ చేసి ఇటీవల అనౌన్స్ చేసారు. 

ఇక నిన్న దీని అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. రా, రస్టిక్ అంశాలతో పవర్ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ఈ టీజర్ పై కొందరు విమర్శలు చేసినప్పటికీ ఓవరాల్ గా ది ప్యారడైజ్ టీజర్ మొత్తంగా 24 గంటల్లో 17.12 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 

READ  Game Changer Detailed Overview Explanation ​'గేమ్ ఛేంజర్' :డిటైల్డ్ ఫైనల్ ఓవర్ వ్యూ 

టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న గ్లింప్స్ టీజర్స్ లో టాప్ 4 వ స్థానంలో నిలిచింది. తప్పకుండా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. కాగా ది ప్యారడైజ్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 మార్చి 26న విడుదల చేయనున్నారు. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories