Home సినిమా వార్తలు Sukumar Grand Plannings for RC 17 Movie RC 17 కోసం సుకుమార్ గ్రాండ్...

Sukumar Grand Plannings for RC 17 Movie RC 17 కోసం సుకుమార్ గ్రాండ్ ప్లానింగ్స్ 

rc 17

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఓవరాల్ గా అత్యద్భుత విజయం అందుకున్న ఈ మూవీ రూ. 1670 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. 

విషయం ఏమిటంటే దీని అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన తదుపరి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు సుకుమార్. ఈ సినిమా యొక్క కథ, కథనాలు గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా దీనిని భారీ యాక్షన్ తో కూడిన గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారట సుకుమార్ అండ్ టీం. 

గతంలో సుకుమార్ రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రంగస్థలం పెద్ద విజయం అందుకుంది. దానితో వీరిద్దరి ఈ క్రేజీ కాంబినేషన్ పై అందరిలో మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version