క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ తొలిసారిగా అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఆర్య మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ అనంతరం దర్శకుడిగా వరుసగా సినిమాలు చేస్తూ పలు సక్సెస్ లు ఫ్లాప్స్ సొంతం చేసుకున్నారు సుకుమార్. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన తీసిన పుష్ప ది రైజ్ మూవీ మంచి విజయం అందుకుంది.
ఇక తాజాగా దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప 2 ది రూల్ మూవీ పై తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఓవైపు ఈ మూవీకి సంబందించి రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు నిర్వహించిన పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో సుకుమార్ పాల్గొనలేదు, త్వరలో హైదరాబాద్ లో జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
అయితే పుష్ప 2 కోసం రాజమౌళి బాటలో సుకుమార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాల తరహాలో ఈ మూవీలో కూడా ప్రతి 15 నిమిషాల కొకసారి హై వోల్టేజ్ సీన్స్ తో పాటు మాస్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ తో సినిమాని ఆద్యంతం ఆడియన్స్ కి చేరువ చేసేలా తీసినట్లు టాక్. అల్లు అర్జున్ పవర్ఫుల్ యాక్టింగ్ కూడా మూవీకి పెద్ద ప్లస్ అని తెలుస్తోంది. అయితే పుష్ప మూవీ మొదట నెగటివ్ టాక్ అందుకుంది, ఇక ప్రస్తుతం పుష్ప 2 కి భారీ క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్ లో పాజిటివ్ టాక్ ని కనుక సొంతం చేసుకుంటే ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం.