నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో సాలిడ్ మాస్ ఎంటర్ టైనర్ ను అందించబోతున్నామని యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. అంతే కాకుండా నిర్మాతలు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా బాగా నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు సినిమా నుండి విడుదలైన మొదటి పాట, పోస్టర్, టీజర్ మొదలైన వాటితో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచడంలో మలినేని టీం విజయం సాధించింది అనే చెప్పాలి. కాగా ఇదివరకే విడుదలైన మొదటి పాట జై బాలయ్యకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు వీరసింహా రెడ్డి ‘సుగుణ సుందరి’ నుండి రెండవ లిరికల్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ పాటలో బాలకృష్ణ వయసు తగ్గి యువకుడిలా కనిపిస్తున్నారు. శ్రుతి హాసన్ మల్టీ కలర్ డ్రెస్ లో అందంగా కనిపించారు. ఎస్.ఎస్.థమన్ అందించిన ట్యూన్, బీట్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి.
మొత్తం మీద ఈ పాట బాలకృష్ణ ఫుల్ ఎనర్జీని కలిగి ఉందని, ఆయన లుక్, స్టెప్పులు చాలా బాగున్నాయని, అభిమానులకు, ప్రేక్షకులకు విందుగా ఉంటుందని అన్నారు. శృతి హాసన్ కూడా చాలా పర్ఫెక్ట్ మరియు స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
ఇక తమన్ పాటను బాగా కంపోజ్ చేశారు మరియు గాయకుల ఎంపిక కూడా చాలా బాగుంది. సుగుణ సుందరి పాట ఖచ్చితంగా వీర సింహా రెడ్డి సినిమా పై బజ్ మరియు అంచనాలను పెంచింది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు రామ్ మిర్యాల, స్నిగ్ధ శర్మ గాత్రం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ మాస్ డ్యూయెట్ కు కొరియోగ్రఫీ చేశారు.దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతి కానుక గా జనవరి 12న ప్రేక్షకుల. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.