సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే దారుణంగా పడిపోయింది. మరియు ప్రేక్షకులను సినిమా హాళ్లలోకి రప్పించడంలో విఫలమైంది. సినిమాకు అధిక శాతం నెగిటివ్ రివ్యూలు రావడం వల్ల ప్రేక్షకులు ఈ చిత్రం పై ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.
నిజానికి మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా అంటే సినీ ప్రేమికులు, విశ్లేషకులు కాస్త మంచి అంచనాలు పెట్టుకుంటారు కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా అవుట్‌పుట్ కూడా చాలా మామూలుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు ఏకగ్రీవంగా తిప్పి కొట్టారు.
ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు ఒక డైరెక్టర్ గా నటించారు. అయితే సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కినా.. ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా చిత్రాన్ని రూపొందించ లేకపోయారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి ఇందులో అద్భుతమైన పాత్ర చేసారని, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో హీరోయిన్ గా స్థిరపడిపోతారని సినిమా విడుదలకు ముందు చాలా గొప్పగా చెప్పారు. కాగా సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఆమె నటనకు మాత్రం పరవాలేదు అనే స్థాయిలో పేరు వచ్చింది.
కాగా ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది. ఇక ధియేటర్లలో ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయిన ఈ చిత్రం ఓటిటిలో మంచి పేరు తెచ్చుకుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కనీసం ఓటిటిలో అయినా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మంచి ఆదరణ పొందుతుందో లేదో వేచి చూడాలి.
ఈ చిత్రంలో కృతి శెట్టి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ మరియు కళ్యాణి ఎన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
నిర్మాతలు బి మహేంద్రబాబు కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్ పై మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా గాజులపల్లె సుధీర్ బాబు ఏ చిత్రాన్ని సమర్పించారు.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.