సినిమా పేరు: శుభం
రేటింగ్: 2.75 / 5
తారాగణం: హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంతం, చరణ్ పేరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,
మరియు శ్రావణి
దర్శకుడు: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాత: సమంత రూత్ ప్రభు
విడుదల తేదీ: 9 మే 2025
టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు తొలిసారిగా నిర్మాతగా మారి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో చేసిన సినిమా శుభం. ఈ మూవీలో సమంత కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. ఇటీవల ట్రైలర్ తో కొంత ఆసక్తి ఏర్పరిచిన శుభం మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇపుడు చూద్దాం.
కథ :
భీమిలిలో నివసించే ముగ్గురు మిత్రుల కథగా ఈ మూవీ సాగుతుంది. శ్రీనివాస్ కి అతడు ఆల్ఫా మేల్ గా ఎలా ఉండాలి అనేది అతడికి పెళ్లి ముందు నేర్పిస్తారు. అయితే పెళ్లి జరిగిన మొదటి రోజు రాత్రి గదిలో జన్మ జన్మల బంధం అనే సీరియల్ అతడికి కాళరాత్రిగా మారుస్తుంది. అయితే అతడి స్నేహితులకి కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో మొత్తంగా వారు ముగ్గురు ఆ టివి సీరియల్ సమస్య నుండి ఎలా బయటపడ్డారు. అసలు ఆ సీరియల్ వెనుక రహస్యం ఏమిటి అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి ముగ్గురు కూడా తమ పాత్రల్లో ఆకట్టుకోగా హర్షిత్ మెయిన్ లీడ్ పాత్రలో మరింతగా అలరించాడు. మెయిన్ హీరోయిన్ గా శ్రియ కొంటం బాగా యాక్ట్ చేసారు, అలానే శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వంశీధర్ గౌడ్ తో కలిసి తల్లి పాత్రలో సీనియర్ నటి మధుమణి కూడా బాగా ఆకట్టుకున్నారు. చిన్న పాత్రలో కనిపించిన సమంత కూడా తన పాత్రలో బాగా పెర్ఫార్మ్ చేశారు. అయితే ఆమె పాత్ర సడన్ గా కనుమరుగవుతుంది.
విశ్లేషణ :
సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమా కోసం టివి సీరియల్ హర్రర్ అనే కథాంశాన్ని తీసుకుని కొంత ఎంటర్టైన్మెంట్ జోడించి బాగానే దీనిని తెరకెక్కించారు. గంగవ్వ పాత్రతో ప్రారంభం అయ్యే ఈ మూవీ మెల్లగా అందరు క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతూ మెయిన్ పాయింట్ కి తీసుకెళ్తుంది.
సందర్భానుసారం వచ్చే కామెడీ సీన్స్ తో పాటు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది మరియు అది సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కూడా చాలావరకు బాగానే ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సినిమా బండి చిత్రంలోని పాత్రలని ఇందులో వాడుకోవడం కలసివచ్చిన అంశం. సెకండ్ హాఫ్ సగభాగం తరువాత అంతగా ఆకట్టుకోదు, అయితే క్లైమాక్స్ పోర్షన్స్ ద్వారా టివి సీరియల్స్, వివాహ బంధం, అల్ఫా మేల్ వంటి అంశాలని వాస్తవికత జోడించి బాగా చూపించారు.
ప్లస్ పాయింట్స్ :
- ప్రధాన పాయింట్
- నటీనటుల పెర్ఫార్మన్స్
- పరిస్థితులకు తగ్గ వినోదం
మైనస్ పాయింట్స్ :
- రెండవ భాగంలో సాగదీసిన సన్నివేశాలు
- కొన్ని అనుకూలమైన ఆలోచనలు
- అంత బలమైన భావోద్వేగాలు సీన్స్ లేకపోవడం
తీర్పు :
మొత్తంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన శుభం సినిమా సరదాగా సాగుతూ ఆడియన్సు ని అలరిస్తుంది. అయితే నార్మల్ స్టోరీ పాయింట్ తో పాటు సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీత సీన్స్ వంటివి కొంత ప్రతికూలతలు.