సినిమా పేరు: సింగిల్
రేటింగ్: 2.75/5
తారాగణం: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవాన, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు
దర్శకుడు: కార్తీక్ రాజు
నిర్మాత: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్
విడుదల తేదీ: 9 మే 2025
యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా ఇవానా, కేతిక శర్మ హీరోయిన్స్ గా కార్తీక్ రాజు తెరకెక్కించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్. ఇటీవల టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచిన ఈ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది మొత్తం రివ్యూలో చూద్దాం.
కథ :
యువకుడైన విజయ్ (Sri Vishnu) తన సింగిల్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటాడు. అతడు తన జీవితంలోకి వచ్చిన పూర్వ, హరిణి లతో ఎలా కొనసాగాడు. చివరికి అతడి సింగిల్ జీవితం వివాహం జీవితంగా ఎవరితో ముడి పడింది అనేది మొత్తం కూడా సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ఎప్పటివలె హీరో శ్రీవిష్ణు తన పాత్రలో మరొక్కసారి కామెడీ టైమింగ్, డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇటీవల వచ్చిన సామజవరగమనా సినిమాతో పెద్ద విజయం అందుకుని ఆ మూవీలో తన పాత్ర ద్వారా మంచి కామెడీ పండించిన శ్రీవిష్ణు, మరొక్కసారి అదే పంథాలో అలరించారు.
ఇక హీరోయిన్స్ గా కనిపించిన కేతిక శర్మ, ఇవానా ఇద్దరూ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు అక్కట్టుకున్నారు. అయితే శ్రీవిష్ణుకి ఈ మూవీలో వెన్నెల కిషోర్ జత కుదరడంతో పలు కామెడీ సీన్స్ బాగానే పండాయి. వారిద్దరి డైలాగ్స్ చాలా వరకు ఫన్నీ గా ఆకట్టుకుంటాయి. విటివి గణేష్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ తో పాటు సత్య పాత్రలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ :
ముఖ్యంగా ఈ మూవీ కోసం పూర్తిగా కామెడీ అంశాన్ని దర్శకుడు కథక్ రాజు ఎంచుకోవడం బాగానే ఉంది. హీరో తన లైఫ్ లోని ఇద్దరు అమ్మాయిలతో నడుచుకోవడం, అలానే వెన్నెల కిషోర్ తో సాగే సీన్స్ బాగానే సరదాగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు కామెడీ అంశాలు అలరించడంతో పాటు సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ఏర్పరుస్తుంది.
అయితే సెకండ్ హాఫ్ కొంత మేర ఎంటర్టైనింగ్ గా సాగి అనంతరం ఎమోషన్ మోడ్ లోకి వెళ్లడంతో కథనం నార్మల్ గా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రాజేంద్ర ప్రసాద్ సీన్స్ గత సినిమాల్లోని సీన్స్ గుర్తు చేస్తాయి. అయితే ఫన్నీ గా అనుకున్న క్లైమాక్స్ ఒకింత నార్మల్ గా సాగుతుంది. మొత్తంగా హీరో శ్రీవిష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ సీన్స్ మరియు వారి యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్.
ప్లస్ పాయింట్స్ :
శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ యాక్టింగ్
ఇంటర్వెల్ ఎపిసోడ్
కొన్ని సృజనాత్మక ఆలోచనలు (సినిమాలు మరియు మీమ్స్ సూచనలు వంటివి)
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన సెకండ్ హాఫ్
ఫ్లాష్‌బ్యాక్‌లో బలవంతపు భావోద్వేగాలు
క్లైమాక్స్
తీర్పు :
మొత్తంగా సింగిల్ మూవీ సరదాగా సాగె ఫన్ రైడ్ గా చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ లేకుండా చాల నార్మల్ గా అనిపిస్తుంది. అయితే శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ల యాక్టింగ్ సినిమాకి ప్లస్ అని చెప్పాలి.