Home సినిమా వార్తలు Superstar Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే మేకోవర్

Superstar Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే మేకోవర్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుతమైన మేకోవర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో తన జిమ్ నుండి ఫోటోలను షేర్ చేస్తూ తన దేహ దారుఢ్యం చూపించారు. తమ అభిమాన హీరోను కొత్త ఫిట్ నెస్ లుక్ లో చూసి మహేష్ బాబు అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు.

పలువురు నెటిజన్లు, మహేష్ అభిమానులు ఆయన కొత్త మేకోవర్ చూసి ఇది ఒక బీస్ట్ మోడ్ తరహాలో ఉండబోతుందని వ్యాఖ్యానించారు. ఇలా మరెన్నో రకాల ఎలివేటింగ్ పదాలతో వారు కామెంట్లు చేశారు.

https://twitter.com/MaheshFanTrends/status/1631137309067476992?t=9S2WR0tYVWE4M7_teyGB4g&s=19

మహేష్ బాబు చివరిసారిగా 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించారు. ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందనను అందుకుంది, కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిలకడగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మంచి వసూళ్లను ఆర్జించింది.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తన మూడో సినిమా, తన కెరీర్ లో 28వ సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆ తర్వాత మహేష్ రాజమౌళి తో కలిసి పనిచేస్తారన్న విషయం తెలిసిందే. కాగా మహేష్ మరియు ఎస్.ఎస్.రాజమౌళి కాంబోలో రానున్న చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఉండబోతాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రం లోని నాటు నాటు పాట 2023 ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటతో పాటు పలు హాలీవుడ్ పాటలు (This Is A Life from Everything Everywhere All At Once; Applause from Tell It Like A Woman; Hold My Hand from Top Gun: Maverick; Lift Me Up from Black Panther: Wakanda Forever) అవార్డు కోసం పోటీ పడనున్నాయి.

2023 మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version