దగ్గుబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన రే డోనోవన్ యొక్క భారతీయ అనుసరణ రానా నాయుడు నిన్నటి నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ అయింది మరియు ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుండి ఇది బాగుందా లేదా అనే చర్చ కంటే అన్ని సమీక్షలు మరియు నెటిజన్ల దానిలో ఉన్న అడల్ట్ కంటెంట్ గురించే ఎక్కువ ప్రతిస్పందన వచ్చింది.
రానా నాయుడు నిన్న మధ్యాహ్నం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవడం మొదలైన వెంటనే మొదటి ఎపిసోడ్ చూసిన నెటిజన్ల రియాక్షన్ షాకింగ్ గా ఉండింది. ఈ వెబ్ సిరీస్ మితిమీరిన అడల్ట్ సీన్స్, బూతు డైలాగులతో నిండిపోయిందని చాలా మంది టాక్ స్ప్రెడ్ చేశారు.
విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీస్ లో మంచి ఇమేజ్ ఉందన్న విషయం తెలిసిందే. మరి ఆయన తొలిసారి వెబ్ సిరీస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటారు కదా. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ యొక్క కంటెంట్ ఫ్యామిలీతో కలిసి చూడటానికి సరిపోదని అందరికీ తెలిసిందే.
విడుదలకు ముందే ఈ విషయాన్ని గ్రహించిన రానా దగ్గుబాటి ఈ షోను కుటుంబ సమేతంగా చూడొద్దని ప్రేక్షకులకు సూచించారు. ‘ఈ షోను విడివిడిగా చూడటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి చూస్తే కొంత అసౌకర్యం కలగవచ్చు. ఇది సినిమాల్లో చేయాల్సిన కథ కాదు. ఓటీటీకి ఇది కరెక్ట్” అన్నారు.
సుపర్న్ వర్మ మరియు కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో తెరకెక్కిన రానా నాయుడు ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో రానా దగ్గుబాటి, వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించగా.. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.