Home సినిమా వార్తలు రజనీకాంత్ సినిమా నుండి బయటకి వెళ్ళిపోయిన స్టార్ హీరోయిన్

రజనీకాంత్ సినిమా నుండి బయటకి వెళ్ళిపోయిన స్టార్ హీరోయిన్

సినిమా అనేది టీమ్ వర్క్ తో కూడుకున్న పని. నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుడు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే సినిమాకి సరైన విధంగా ఫలితం వస్తుంది. అయితే అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో నటులు తమ సహనటులతో, లేదా దర్శక నిర్మాతలతో సృజనాత్మక లేదా వ్యక్తిగత విభేదాల కారణంగా సినిమాల నుండి వైదొలగడం సర్వసాధారణం. ఈ తరంలో హీరో హీరోయిన్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగడం మరింత సాధారణ విషయంగా మారిపోయింది.

యువ దర్శకుడు నెల్సన్‌తో రజనీకాంత్ తదుపరి చిత్రం జైలర్ అనే పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ చూసి రజనీ అభిమానులు తమ హీరోకి మరో సూపర్ హిట్ రానుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీ మరియు నెల్సన్‌ల తాజా కలయిక చాలా ఆసక్తికరమైనదే కాకుండా వైవిధ్యాన్ని చూపగల అవకాశం ఉన్న సినిమా.

కొంతకాలం క్రితం, నెల్సన్ ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్‌ను ఒక ప్రధాన పాత్రలో నటించేందుకు తీసుకున్నారు. నెల్సన్ గతంలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అయిన డాక్టర్‌ సినిమాలో ప్రియాంకతో కలిసి పనిచేశారు. ఆ రకంగా మళ్ళీ హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందని అందరూ భావించారు.

అయితే నెల్సన్‌తో కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా ప్రియాంక జైలర్ సినిమా నుండి బయటకు వెళ్లిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. నిజానికి డాక్టర్ షూటింగ్ సమయంలో కూడా వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. జైలర్ సెట్స్‌లో జరిగిన ఒక సంఘటన వల్లే ప్రియాంక, సూపర్ స్టార్ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు అని సమాచారం.

నిజానికి ఏ నటి అయినా రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం అంటే ఎంతో సంతోషిస్తారు అలానే ఆ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది ఆయన సినిమా నుండి, మరియు ఇంతటి భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. ఇక ప్రియాంక ఈ సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత ఈ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ ఎవరిని ఎంచుకుంటారో చూడాలి.

కాగా సీనియర్ నటి రమ్యకృష్ణ మరియు యువ సంగీత తరంగం అనిరుధ్ ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌లో చాలా కీలకమైన భాగంగా ఉన్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version