టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ సొంతం చేసుకున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఆ మూవీ తరువాత త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేయనున్నారు మహేష్.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి గరుడ అనే టైటిల్ ని టీమ్ ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు.
విజువల్ డెవెలప్మెంట్ ఆర్టిస్ట్ టిపి విజయన్ SSMB 29 కి సంబంధించి గోల్డెన్ ఈగిల్ వింగ్స్ పిక్ ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దానిని బట్టి చూస్తుంటే గతంలో రాజమౌళి చెప్పిన తన డ్రీం ప్రాజక్ట్ గరుడ ఇదే అని, అలానే ఈ మూవీ టైటిల్ కూడా గరుడ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.