టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో దిగజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ లో మూడో షెడ్యూల్ పట్టాలెక్కనుంది.
ఇక ఆ షెడ్యూల్లో భారీ స్థాయిలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ ని నిర్మిస్తుండగా అది వారణాసి సెట్ అని తెలుస్తోంది.
ఇక్కడ షూటింగ్ అనంతరం టీం మొత్తం కూడా సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియా, బల్గేరియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్ళనుందని అక్కడ పలు భారీ యాక్షన్ సన్నివేశాలు ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారని టాక్.
హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఎన్నో వందల కోట్ల భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరిలో కూడా ఎన్నో అంచునాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా క్రాఫ్, గడ్డం, తో పాటు బాడీని పెంచారు మహేష్.
అయితే విషయం ఏమిటంటే మే 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా SSMB 29 అఫీషియల్ అనౌన్స్మెంట్ మరియు టైటిల్ గ్లింప్స్ వస్తుందని అందరూ భావించారు. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం అది ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంటున్నారు.
అయితే సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9 నే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజం అవుతుందో జక్కన్న ఎప్పుడు ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ అందిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.