సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ఎంటర్టైనర్ మూవీ SSMB 29.
ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం ఒడిశా లోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పటికే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక జరుగుతోందట . ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో గ్రాండ్ గా షూట్ చేస్తున్నారట.
అలానే మూవీని ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించి పక్కాగా 2027 ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.
మరోవైపు పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రానున్న ఉగాది సందర్భంగా రానుందనే వార్తలు కూడా వస్తున్నాయి.