Home సినిమా వార్తలు SSMB28: షూటింగ్ తొందరగా ముగించాలనే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం

SSMB28: షూటింగ్ తొందరగా ముగించాలనే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా కావడంతో పాటు ఇది మహేష్ కెరీర్‌లో 28వ చిత్రం అవడంతో ఈ సినిమా SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రసిద్ధి చెందింది.

2010లో వచ్చిన ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై మహేష్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా స్క్రిప్ట్ లో మార్పులు జరగడం.. మరియు ఇటీవలే దురదృష్టవశాత్తూ సూపర్ స్టార్ కృష్ణ మరణం వంటి పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సినిమాని ఆగస్ట్ 2023 నాటికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే ఏడాది జులై నాటికి షూటింగ్‌ను ముగించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోందట.

త్రివిక్రమ్ తన సినిమాలను త్వరగా పూర్తి చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా కోసం మొదట యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినా స్క్రిప్ట్‌లో తేడాలు రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌ని ఖరారు చేయడం జరిగింది. కొత్త స్క్రిప్ట్‌తో, డిసెంబర్ మొదటి వారంలో సెట్స్‌ పైకి వెళ్లడానికి SSMB28 టీమ్ ప్రయత్నిస్తున్నారు.

మరి అనుకున్న విధంగా డెడ్లైన్ ను చిత్ర బృందం చేరుకుంటుందో లేదో వేచి చూడాలి. హడావుడిగా పనులు చేయడం వల్ల సినిమాకు ఎలాంటి మేలు జరగదు కానీ లాభనష్టాలకు వారే యజమానులు కాబట్టి అది వారి ఇష్టం మరియు నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది.

మహేష్ ఒక పర్ఫెక్షనిస్ట్ గా పేరు పొందారు. డెడ్‌లైన్‌లను చేరుకోవడం కోసం అయన నాణ్యత లేని విషయంలో రాజీపడరు. ఈ వైఖరి ఖచ్చితంగా మంచిది, కానీ అదే సమయంలో నిర్మాతల దృక్కోణం నుండి చూస్తే సినిమాని ఆలస్యం చేయడం మరింత వివాదం అవుతుంది. మరి త్రివిక్రమ్ క్వాలిటీ మరియు టైమ్‌ని ఎంతవరకు మేనేజ్ చేస్తారో వేచి చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version