Homeసినిమా వార్తలుSSMB28: మహేష్ వైఖరి పట్ల సంతోషంగా లేని నిర్మాతలు

SSMB28: మహేష్ వైఖరి పట్ల సంతోషంగా లేని నిర్మాతలు

- Advertisement -

టాలీవుడ్ స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్‌ తీసుకున్న సూపర్‌స్టార్‌ లండన్‌లో ఉన్నారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ నవంబర్‌లో ప్రారంభం కానుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే కొన్ని పుకార్లు రావడం జరుగుతోంది. మహేష్ బాబు మరియు చిత్ర నిర్మాతల మధ్య సమస్యల గురించి పలు రకాల పుకార్లు ప్రస్తుతం పరిశ్రమ వర్గాలలో వస్తున్నాయి.

కొన్ని నెలల క్రితమే భారీ హైప్‌తో ఈ సినిమాని అనౌన్స్‌ చేయగా, మహేష్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో మూడోసారి సినిమా రాబోతున్నందుకు మహేష్ అభిమానులు మరియు ఇతర సినీ ప్రేమికులు ఎంతగానో సంతోషించారు.

కానీ మహేష్ బాబు త్రివిక్రమ్‌ని ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేయమని అడగడం ద్వారా షూటింగ్ ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. నిజానికి మొదట ఈ చిత్రాన్ని 2023 వేసవిలో ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా విడుదలైన తేదీకి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే షూటింగ్‌లో జాప్యం కారణంగా ఇప్పుడు ఆ తేదీన విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.

READ  మళ్ళీ రిపీట్ కానున్న మ్యాజికల్ కాంబినేషన్

అందువల్ల ఈ చిత్రాన్ని ఆగష్టు 2023లో విడుదల చేయాలని ఈ నిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా, స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు చేర్పులు వంటి కారణాలతో మహేష్ బాబు సినిమా షూటింగ్‌ని నిరంతరం ఆలస్యం చేస్తున్నందున ఈ తేదీ కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.

త్రివిక్రమ్ సిద్ధం చేసిన స్క్రిప్టు పట్ల మహేష్ అస్సలు సంతోషంగా లేరని, దాంతో అనేక సవరణలు మరియు మార్పులను కోరుతున్నారని తెలుస్తోంది. అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం, డైలాగ్ వెర్షన్‌తో సహా పూర్తి స్థాయి స్క్రిప్టుతో రావాలని త్రివిక్రమ్‌ని మహేష్ కోరినట్లు సమాచారం.

ఇన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 1% కూడా పూర్తి కాకపోవడంతో షెడ్యూల్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. అంతే కాకుండా ఈ కారణం వల్ల ఇతర నటీనటులు మరియు సిబ్బంది తేదీలను సరైన విధంగా నిర్ధారణ చేయలేకపోతున్నారు, ఇది నిజంగా వారికి చాలా భారంగా మారుతుంది.

అయితే ఈ పరిస్థితికి పూర్తిగా మహేష్‌ని నిందించలేము. ఇటీవలే తన తల్లి మరణించడంతో ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు. కాబట్టి ఆయన తన భావోద్వేగ గందరగోళం నుండి బయటపడి, చిత్రీకరణకు 100% సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే షూటింగ్‌లో పాల్గొనగలరు అనే విషయాన్ని గుర్తించాలి. మహేష్ త్వరలో సెట్స్‌ పైకి వచ్చి సినిమాకి తన బెస్ట్ వర్క్ ను అందించాలని కోరుకుందాం.

READ  మహేష్ - త్రివిక్రమ్ ల SSMB28 షూటింగ్ రెండవ షెడ్యూల్ వివరాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories