Homeసినిమా వార్తలుSSMB28: మార్కెట్లో భారీ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా

SSMB28: మార్కెట్లో భారీ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ల కలయికలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న అంటే 16 ఏళ్ళ క్రితం పోకిరి సినిమా విడుదలైన రోజున విడుదలవుతుంది. అంతే కాకుండా దాదాపు 13 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి పని చేస్తుండటం వల్ల ఈ సినిమా కోసం అభిమానులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు.

అతడు, ఖలేజా తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌లకు ఇది మూడో సినిమా కావడం విశేషం. చిత్ర నిర్మాతలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే అభిమానులు హ్యాట్రిక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ SSMB28 షూటింగ్ కూడా మొదలు కాలేదు, కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ చిత్రం హాట్ ఫేవరెట్‌గా చలామణి అవుతుంది. నిర్మాతలకు డిస్త్రిబ్యుటర్స్ నుంచి భారీ ఆఫర్ లు ముడుతున్నట్లు సమాచారం.

మరో విశేషం ఏమిటంటే భారీ హైప్ తో రానున్న SSMB28 సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అని తెలియ వచ్చింది. అయితే అందుకు ముందుగా మహేష్ బాబు ఒప్పుకోవాలి. ఆయన తుది నిర్ణయం ఏదైతే అది నిర్మాతలు అమలు పరుస్తారట.

READ  పరంపర వెబ్ సిరీస్ రివ్యూ: ఆకట్టుకున్న రాజకీయ చదరంగం

ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్ తాలూకు ఆఫర్లు మొదలయ్యాయి అని సమాచారం. మరో రెండు నెలల్లో బిజినెస్ ఒప్పందాలు ముగిసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం తాలూకు షూటింగ్ ఆగస్ట్ నెలలోనే మొదలవ్వాలి.. అయితే అనుకోని పరిస్థితుల్లో తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ షూటింగులు బంద్ చేయడంతో అది జరగలేదు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఒక ముఖ్య పాత్రకి మలయాళ మరియు హిందీ నటుల పేర్లు వినిపించినా అవేవీ అధికారికంగా ధృవీకరించలేదు.

త్రివిక్రమ్ ఈ సినిమాను తన మునుపటి శైలిలో కాకుండా కొత్త తరహాలో తీయాలని నిర్ణయించుకున్నారట. తన సహజ సిద్ధమైన ఫ్యామిలీ కథలకు దూరంగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.తాజాగా, ‘అల వైకుంఠపురములో’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తరువాత త్రివిక్రమ్ మళ్ళీ అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాకుండా యాక్షన్ నేపధ్యంలో సినిమాని తెరకెక్కించబోతున్నారు. అలాగే జానర్‌తో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా భిన్నంగా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రానికి ప్రస్తుతం అద్భుతమైన ఫార్మ్ లో ఉన్న ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

READ  థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories