Homeసినిమా వార్తలుSSMB28 ప్యాన్ ఇండియా సినిమా కాదు - నిర్మాత నాగ వంశీ

SSMB28 ప్యాన్ ఇండియా సినిమా కాదు – నిర్మాత నాగ వంశీ

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న SSMB28 సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించడం జరిగింది. ఇక తదుపరి షెడ్యూల్‌లో మహేష్, పూజా హెగ్డేల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత మహేష్‌తో కలిసి సినిమా చేస్తున్న త్రివిక్రమ్, తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాకు సరికొత్త లుక్ తో పాటు కొత్త ట్రీట్‌మెంట్ కూడా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ నాణ్యతతో నిర్మిస్తుంది. ఈ చిత్రం అధికారికంగా ప్రకటించిన రోజు నుండి, SSMB28 సినిమా టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. అయితే అదే క్రమంలో ఈ చిత్రం గురించి రకరకాల పుకార్లు కూడా వినిపించాయి. భారీ బడ్జెట్ అని, థియేట్రికల్ రైట్స్ మరియు ఆడియో రైట్స్ కూడా చాలా గొప్ప ధరలకు అమ్ముడయ్యాయి అని, ఇలా చాలా రకాలుగా ఏవేవో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా “స్వాతిముత్యం” సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. నిర్మాత నాగ వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో SSMB28 ప్రాజెక్ట్ గురించిన ఈ పుకార్ల పై వివరణ ఇచ్చారు.

ఈ సినిమా బిజినెస్‌ పై మార్కెట్‌లో వస్తున్న లెక్కలు అన్నీ పూర్తిగా తప్పు అని నాగ వంశీ స్పష్టం చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి అసలు ఎలాంటి బిజినెస్ చేయ‌లేదని నాగ వంశీ అన్నారు. ఇక ఆయన మరో ముఖ్యమైన విషయం కూడా తెలియజేశారు. కొన్ని మీడియా వర్గాలు చెప్పిన విధంగా ఇది ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ కాదని, ఒక ఔట్ అండ్ అవుట్ తెలుగు సినిమా మాత్రమేనని ఈ మేరకు నాగ వంశీ స్పష్టం చేశారు.

READ  ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం కోసమే బ్రహ్మాస్త్ర ఈవెంట్ ను రద్దు చేశారా?

ఈ చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు మహేష్ అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories