టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్వరలో పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన జక్కన్న రాజమౌళి తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న ఈ మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపుగా రూ. 1000 కోట్లకు పైగా వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందించనున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో సలార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నెగటివ్ పాత్రలో నటించనున్నారని అంటున్నారు. ఇటీవల రాజమౌళి అండ్ టీమ్ ఆయనని సంప్రదించి ఆ పాత్ర కోసం సైన్ చేయించుకున్నట్లు చెప్తున్నారు.
అయితే దీని పై SSMB 29 మూవీ టీమ్ నుండి మాత్రం అఫీషియల్ ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీలో పలువురు ఇండియన్ నటులతో పాటు హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇక ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజైన ఆగష్టు 9న అఫీషయల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్ డేట్స్ కోసం మా సైట్ చూస్తూ ఉండండి.