సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల తొలి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 అనౌన్స్ మెంట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఆగష్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ నాడు రానుందని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ ప్రాజక్ట్ లో మలయాళ స్టార్ నటుడు, డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారని, ఆయన పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని కూడా వార్తలొచ్చాయి.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పృథ్వీరాజ్ నిజంగానే SSMB 29 లో ఉన్నారనేది ఇంకా పక్కాగా కన్ఫర్మ్ కాలేదని, ఆ విషయమై మేకర్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు. సో దీనిని బట్టి ఈ ప్రతిష్టాత్మక మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ సహా ఇతర వివరాలన్నింటి పై మేకర్సే స్వయంగా క్లారిటీ ఇవ్వాలి.