టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ ని త్వరలో హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో అలానే రామోజీ ఫిలిం సిటీ లో జరుపనుంది టీమ్. ఆపైన మూవీ టీం కెన్యా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బల్గేరియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్లనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అవర్స్ అందరిలో విశేషమైన అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అగైన్ అనే రేంజ్ లో ఉంటుందని, భారతీయ సినీ పరిశ్రమ గర్వించేలా ఈ సినిమాని జక్కన్న రాజమౌళి అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే విషయం ఏమిటంటే ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా మార్చి 25న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు జక్కన్న అండ్ టీం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి సరిగ్గా ఇదే డేట్ కి 2022 లో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది. అంటే 25 మార్చి 2027న SSMB 29 మూవీ రిలీజ్ అయితే అప్పటికి సరిగ్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తవుతుందన్నమాట. మరి రీలీజ్ అనంతరం SSMB 29 మూవీ ఏ స్థాయి విజయం అందుకుని ఎంతమేర ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.