టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దిగ్గజ దర్శకడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 యొక్క అనౌన్స్ మెంట్ కోసం సూపర్ స్టార్ మహెష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని, వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఈ మూవీలో తన క్యారెక్టర్ కోసం ఇప్పటికే బల్క్ బాడీతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు సూపర్ స్టార్.
విషయం ఏమిటంటే, ఈ భారీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ అక్టోబర్ 10న ఎస్ ఎస్ రాజమౌళి బర్త్ డే నాడు అనౌన్స్ కానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించిన ఈ మూవీ కోసం మరోవైపు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ యొక్క ఎంపిక జరుగుతోందట. అలానే మూవీని డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు.