టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా 1999 లో రిలీజ్ అయిన రాజకుమారుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా అనేక బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో కొనసాగిన మహేష్, ఇటీవల గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం అందుకున్నారు.
ఇక త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 లో నటించేందుకు సిద్ధమవుతున్నారు మహేష్. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ మూవీ త్వరలో లాంచింగ్ కి రెడీ అవుతోంది. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేయనున్నారని, అలానే రెండు పాత్రలు ఎంతో పవర్ఫుల్ గా రాజమౌళి డిజైన్ చేస్తున్నారని అంటున్నారు.
మరి ఇదేకానుక నిజం అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఈ ఫీట్ తొలిసారిగా చేస్తున్నారని చెప్పాలి. అయితే దీని పై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. కాగా గతంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని మూవీలో కొన్ని క్షణాలు హీరో తండ్రి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.