Homeసినిమా వార్తలుకల్కి 2898 ఏడి మాదిరిగా SSMB29 కూడానా ?

కల్కి 2898 ఏడి మాదిరిగా SSMB29 కూడానా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఫస్ట్ డే నెగటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ ఆ తరువాత మహేష్ స్టార్డంతో మంచి కలెక్షన్ రాబట్టి థియేటర్స్ లో బాగా కొనసాగి పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అందుకుంది. ఇక దాని అనంతరం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో హీరోగా నటించనున్నారు సూపర్ స్టార్ మహేష్. 

ఇప్పటికే ఈ మూవీ కోసం బల్క్ గా బాడీని పెంచడంతో పాటు పలు యుద్ధ విద్యల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు మహేష్ బాబు. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ ఎప్పుడెప్పుడు అనౌన్స్ అవుతుందా అని కేవలం సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ పాత్రని హనుమంతుని ఇన్స్పిరేషన్ తో సిద్ధం చేస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక మూవీలో భారీ యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా పక్కాగా స్టోరీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ మూవీలో కూడా ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన కల్కి 2898 ఏడి మాదిరిగా మైథాలజీ అంశాన్ని జక్కన్న టచ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అదే కనుక నిజం అయితే జక్కన్న వాటిని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. కాగా SSMB29 మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

READ  SSMB 29 Villain Role Fixed బ్రేకింగ్ : SSMB 29 లో విలన్ గా 'సలార్' యాక్టర్ ఫిక్స్ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories