గత కొన్ని నెలలుగా, రాజమౌళి ఆయన తెరకెక్కించిన తాజా భారీ చిత్రం RRR విజయం తర్వాత కెరీర్ లోనే ఉత్తమ దశలో ఉన్నారు. కానీ ఒక దర్శకుడికి ఎన్ని భారీ విజయాలు వచ్చినా.. మునుపటి సినిమా సాధించిన విజయం కంటే ఆ తర్వాత కొత్త సినిమా ప్రారంభం తాలూకు ఉత్సాహం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత, రాజమౌళి ఇక RRR ను వదిలి తన దృష్టిని మహేష్ బాబుతో తీయబోయే తదుపరి చిత్రంపై మళ్లించారు.
రాజమౌళి ఇటీవలే మహేష్ బాబుతో తను తెరకెక్కించే తదుపరి చిత్రం కోసం హాలీవుడ్ ఏజెన్సీ CAAతో అధికారికంగా సంతకం చేశారు. ఈ చిత్రం ఒక ఎపిక్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తారని చెప్పబడింది. కాగా ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రపంచాన్ని చుట్టే (Globe trotting) చిత్రంగా అభివర్ణించారు.
RRR తర్వాత USలో రాజమౌళి బ్రాండ్ విలువ భారీగా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ ప్రేక్షకులలో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. దీని ఫలితంగానే క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ అనే హాలీవుడ్ ఏజెన్సీ అయిన CAA వారు రాజమౌళితో ఒప్పందం కుదుర్చుకున్నారు. హాలీవుడ్లో సంగీతం, టీవీ మరియు క్రీడా పరిశ్రమకు చెందిన కొందరు అగ్ర తారలు మరియు ప్రముఖులు ఈ ఏజెన్సీతో ఇదివరకే జతకట్టారు.
CAAతో జరిగిన ఈ ఒప్పందం వల్ల.. రాజమౌళి తదుపరి మహేష్ బాబుతో చేసే సినిమా భారీ ప్రయోజనాలను పొందుతుంది అనడంలో సందేహం లేదు. ఓవర్సీస్‌లో, ప్రత్యేకించి యూఎస్ లో తప్పకుండా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ పొందుతుంది. అంతే కాకుండా తొలిసారిగా ఓ భారతీయ దర్శకుడికి అంతర్జాతీయ సినిమా అందించే వీలు ఉంటుంది. రాజమౌళి తొలిసారిగా ప్యాన్-ఇండియన్ సినిమా తీయడమే కాకుండా అంతర్జాతీయ సినిమా తీసిన మొదటి వ్యక్తిగా కీర్తిని సంపాదిస్తారు. ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ స్థాయిలో విడుదల కానుంది. మరియు ఇంగ్లీష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాషలలో కూడా ఈ సినిమా డబ్ చేయబడుతుందట. ఇది నిజంగా తెలుగు సినీ ప్రేక్షకులకు గర్వించే విషయం అవుతుంది.
మరి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ సినీ అభిమానులను అమితంగా అలరించేలా రాజమౌళి – మహేష్ సినిమా ప్యాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.