Homeసినిమా వార్తలునారప్ప తో ఖిలాడి అంటున్న అడ్డాల

నారప్ప తో ఖిలాడి అంటున్న అడ్డాల

- Advertisement -

2008 లో వచ్చిన “కొత్త బంగారు లోకం”తో ప్రేక్షకులకి పరిచయమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తొలి చిత్రంతోనే చక్కని అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అడ్డాల ఆ తరువాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం తో ఆశ్చర్య పరిచాడు.ఇద్దరు స్టార్ హీరోలతో చాలా సున్నితమైన కుటుంబ కథా చిత్రం తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోయినా మహేష్ క్యారెక్టర్ ను ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు హీరోలతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.విక్టరీ వెంకటేష్ – మాస్ రాజా రవితేజల కలయికలో ఆ సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్,ఇతర సాంకేతిక వర్గం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పుడు తరువాత నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ను పరిచయం చేస్తూ తీసిన “ముకుంద” సినిమా అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందకపోయినా, పాటలు మరియు కొన్ని సంభాషణలకు పేరు వచ్చింది.ఆ తరువాత మహేష్ బాబు తోనే మళ్ళీ జోడీ కట్టి తీసిన “బ్రహ్మోత్సవం” తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కేవలం బాక్స్ ఆఫీస్ కాకుండా సినిమాలో ఉన్న పాత్రలు,సంభాషణలు, కథ,కథనం ఏవీ ప్రేక్షకులకు నచ్చకపోగా చాలా వరకు అసలు అర్థం కాకుండా సినిమా ఉందనే టాక్ ను తెచ్చుకుంది.

READ  మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పవన్?

స్వతహాగా సాప్ట్ నేచర్ ఉండే పాత్రలు, నేపథ్యాలు ఎంచుకునే అడ్డాల కి గ్రామీణ వాతావరణం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల యాస,అక్కడి మనుషుల మీద మంచి అవగాహన ఉంది. అయితే ఒక దర్శకుడుగా అవి మాత్రమే సరిపోవు కదా. సినిమాలో బలమైన కథ లేదా పాత్రలు ఉంటేనే అది ప్రేక్షకులను ఆకట్టుకునే వీలుంటుంది. తన అభిరుచుల తో పాటు దర్శకుడిగా సినిమా,రచన పై ఉండాల్సిన పట్టు కోల్పోవడం వల్ల అడ్డాల ఆ తరువాత చాలా రోజులు సినిమాకే దూరమయ్యారు.ఆరేళ్ల తరువాత అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా “నారప్ప”, ఇది తమిళంలో వచ్చిన “అసురన్” కు రీమేక్. కరోనా వల్ల ఓటిటిలో విడుదల అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఇంక అడ్డాల మళ్ళీ ఫామ్ అందుకోవటం కష్టమే అనే అభిప్రాయం ఏర్పడింది.ఇప్పుడు తాజాగా ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అడ్డాల ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రేక్షకుల నుండి నాని దూరం అవుతున్నాడా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories