Homeసినిమా వార్తలుఅల్లూరిగా వస్తున్న శ్రీవిష్ణు..టీజర్ అదుర్స్

అల్లూరిగా వస్తున్న శ్రీవిష్ణు..టీజర్ అదుర్స్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎదుగుతున్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. వైవిధ్యమైన కథలు,పాత్రలతో విమర్శకులను, ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్ అయినా ఫ్లాఫ్ అయినా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీ విష్ణు. ఎక్కువగా ఎమోషనల్ సబ్జెక్ట్ లతో సినిమాలు తీసే శ్రీవిష్ణు.. మధ్యలో కామెడీ టచ్ ఉన్న సినిమాలూ చేశారు.

అయితే ఇప్పుడు శ్రీ విష్ణు మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా బ్యానర్ పై ‘అల్లూరి’ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో మొదటి సారి శ్రీవిష్ణు పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా కనిపిస్తున్నారు.ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయలుదేరాడురా అంటూ మాస్ టచ్ తో మొదలైన టీజర్,ఆ తరువాత విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయితీ..నిజాయితీకి మారుపేరు అల్లూరి అంటూ కాస్త విప్లవాన్ని జోడించి ఆకట్టుకునేలా సాగింది.

READ  ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పోలీస్ సినిమాలు అంటేనే సాధారణంగా ఒక ఫార్ములాతో ఉంటాయి,ఈ సినిమా కూడా అదే దారిలో నడిపిస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మాస్ హీరోయిజం ఉన్న పాత్రలో శ్రీవిష్ణు చేయలేదు,కనుక ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీవిష్ణు గత చిత్రం భళాతందనాన ఘోరంగా పరాజయం పాలవడంతో ఈసారి ఎలాగైనా గట్టి హిట్టు కొట్టాలని అనే ధృడసంకల్పంతో ఉన్న శ్రీవిష్ణు సినిమా కోసం తన లుక్ ను కూడా మార్చుకున్నారు.ఈ సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  F3 OTT రిలీజ్ ఎప్పుడంటే..


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories