Homeసినిమా వార్తలు'స్పిరిట్' : అంచనాలకు మించి

‘స్పిరిట్’ : అంచనాలకు మించి

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. దీంతోపాటు మరోవైపు సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల అనంతరం అతి త్వరలో ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న  యాక్షన్ మూవీస్ స్పిరిట్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నారు. 

ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుతూ ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ అని, తన మార్క్ మేకింగ్ తో పాటు ప్రభాస్ స్టైల్ యాక్షన్ అంశాలు కూడా ఇందులో ఉంటాయని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో జరుపనున్నామని అన్నారు. ఈ ఏడాది చివర్లో ఇది పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే తమ టీం అక్కడి పలు లొకేషన్స్ పరిశీలిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ సినిమాని భద్రకాళి పిక్చర్స్, టిసిరీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియాని మించేలా గ్రాండ్ లెవెల్ లో నిర్మించేందుకు సన్నద్ధం అవుతున్నాయట. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.

READ  పెద్ది గ్లింప్స్ : మాస్ ఫీస్ట్

గతంలో ఆయన సందీప్ రెడ్డి వంగతో చేసిన యానిమల్ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అందరి నుంచి విశేషమైన రెస్పాన్స్ లభించింది. ఇక స్పిరిట్ మూవీని వేగంగా ఎక్కడా బ్రేక్ లేకుండా చిత్రీకరించి 2026 చివర్లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తుంది. మొత్తంగా అంచనాలను మించేలా రూపొందనున్న స్పిరిట్ ఏస్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  SVSC Sequel was there but SVSC సీక్వెల్ ఉంటుందట......కానీ ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories