పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి ద్వారా ఆడియన్స్ ముందుకి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. దాని అనంతరం సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి తో ఒక మూవీ అలానే స్పిరిట్ వంటివి ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
అయితే వీటిలో త్వరలో సలార్ 2 షూట్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్న ప్రభాస్, మరోవైపు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చిన స్పిరిట్ మూవీ షూట్ లో ఈ ఏడాది చివర్లో పాల్గొననున్నారు. టి సిరీస్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథగా రూపొందనుండగా ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనేలా డిజైన్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.
మ్యాటర్ ఏమిటంటే, స్పిరిట్ మూవీలో విలన్ గా ప్రముఖ ఇంటర్నేషనల్ కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ (Ma Dong-seok) ని ఎంపిక చేసారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. గతంలో ది రౌండప్ సిరీస్ మూవీస్, ది అవుట్ లాస్, ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్ వంటి మూవీస్ లో నటించి ఆయన మంచి క్రేజ్ అందుకుందుకున్నారు. ఇక స్పిరిట్ లో లవ్, యాక్షన్ ఎమోషనల్ అంశాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా గ్రాండియర్ గా ఉండడనున్నాయని, వాటిని పలువురు కొరియన్ ఫైట్ మాస్టర్స్ తో కంపోజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా స్పిరిట్ గురించిన ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. అయితే దీని పై మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.