ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా సక్సెస్ లతో అలానే కెరిర్ పరంగా మంచి లైనప్ తో కొనసాగుతున్నారు. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సినిమాపై మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచింది.
ఇక దీని అనంతరం తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. ఈ సినిమాపై అందరిలో కూడా విశేషమైన అంచనాలు న్నాయి. ఇటీవల యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి భారీ విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా, స్పిరిట్ స్క్రిప్ట్ ని కూడా ఎంతో అత్యద్భుతంగా సిద్ధం చేసుకున్నారట. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథగా రూపొందనున్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఎంతో బాగుంటుందని అంటున్నారు.
ఇక విషయం ఏమిటంటే దీపావళి పండుగ సందర్భంగా స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ సిట్టింగ్స్ తాలూకు ఒక చిన్న వీడియో బైట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా స్పిరిట్ మూవీని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.