టాలీవుడ్ స్టార్ నటుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మొత్తం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వీటిలో మారుతి తీస్తున్న ది రాజా సాబ్ మూవీ ముందుగా ఆడియన్స్ ముందుకి రానుండగా అనంతరం హను రాఘవపూడి తీస్తున్న మూవీ రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వీటి అనంతరం ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది.
ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుంది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా ప్రభాస్ ఈ మూవీలో ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. అందరిలో భారీ హైప్ కలిగిన స్పిరిట్ కి సంబంధించి తాజాగా మ్యూజికల్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.
గతంలో సందీప్, హర్షవర్ధన్ ల కాంబోలో వచ్చిన యానిమల్ ని మించేలా ఈ సాంగ్స్ ని అద్భుతంగా సిద్ధం చేస్తున్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది.