టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మూడు మూవీస్ రూపొందుతున్న సినిమాలు రెండు. కాగా అందులో మారుతీ తీస్తున్న ది రాజాసాబ్ ఒకటి కాగా హను రాఘవపూడి తీస్తున్న మూవీ మరొకటి. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇప్పటికే ప్రభాస్ మరొక మూడు సినిమాలకు కూడా పచ్చ జండా ఊపిన విషయం తెలిసిందే. అవి సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2, నాగ అశ్విన్ తీయనున్న కల్కి 2898 ఏడి 2.
అయితే వీటిలో సందీప్ రెడ్డి తీయనున్న స్పిరిట్ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల రణబీర్ కపూర్ తో ఆనిమల్ మూవీ తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు సందీప్. ఇక కెరీర్ పరంగా ప్రభాస్ కూడా వరుసగా బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్నారు. దానితో ఈ క్రేజీ కాంబో మూవీ స్పిరిట్ పై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.
విషయం ఏమిటంటే, వాస్తవానికి డిసెంబర్ చివర్లో లేదా జనవరిలో ప్రారంభం కావాల్సిన ఈ మూవీ షూట్ వచ్చే వేసవికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ షూటింగ్ మరికొన్నాళ్లు వాయిదా పడడం ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంత నిరాశే అని చెప్పాలి. కాగా ఈ మూవీ కోసం ప్రభాస్ పూర్తిగా కొత్త మేకోవర్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక దీనిని 2026 ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.