Homeసినిమా వార్తలుమెగాస్టార్ స్టార్డంను ప్రశ్నిస్తున్న పోకిరి-జల్సా స్పెషల్ షోలు?

మెగాస్టార్ స్టార్డంను ప్రశ్నిస్తున్న పోకిరి-జల్సా స్పెషల్ షోలు?

- Advertisement -

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి రీ-రిలీజ్ ఘనవిజయం సాధించిన తరువాత, ప్రత్యేక షోలను ఏర్పాటు చేసే ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమలో మొదలైన సంగతి తెలిసిందే. పోకిరి స్పెషల్ షోలు ఈ రి రిలీజ్ ల విషయంలో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ఏర్పాటు చేసిన ప్రతి షో కూడా హౌస్‌ఫుల్‌గా ఉండటంతో పోకిరి రికార్డ్ కలెక్షన్లు నమోదు చేసింది.


దీని తర్వాత, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక షోలను ప్లాన్ చేసారు. చిరంజీవి 30 ఏళ్ళ క్రితం నటించిన ఘరానా మొగుడు సినిమా యొక్క ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు ఈ షోల పట్ల అంతగా ఆసక్తి చూపించలేదని చెప్పాలి. కేవలం కొన్ని షోలకే పరిమితమైనా.. ఘరానా మొగుడు సినిమా స్పెషల్ షోలు ఎక్కువగా హౌజ్ ఫుల్ బోర్డులను నమోదు చేయలేకపోయింది.


ఇక ఆ తర్వాత తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక షోలను ప్లాన్ చేశారు. 2008లో విడుదలైన బ్లాక్ బస్టర్ జల్సా సినిమాని అందుకు వారు ఎంచుకున్నారు. జల్సా సినిమా ప్రత్యేక ప్రదర్శనలను చాలా భారీ స్ధాయిలో ఒక కొత్త సినిమా విడుదల చేసినట్లు ఏర్పాట్లు చేశారు. 

READ  రెమ్యునరేషన్ల విషయంలో నిర్మాతల ఆలోచన సరైనదేనా?


అయితే ఆశ్చర్యకరంగా బుకింగ్స్ ఓపెన్ చేసిన మరక్షణమే టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఎవరూ ఊహించని విషయం. ఆ క్రమంలో స్పెషల్ షోల సంఖ్య, కలెక్షన్లలో అల్ టైం రికార్డు సృష్టించిన సినిమాగా నిలిచింది. అయితే ఇక్కడ హీరోగా పవన్ కళ్యాణ్ స్టామినాతో పాటు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో జల్సా సినిమా పట్ల ఉన్న ఇష్టం వల్ల ఈ రికార్డు సాధ్యపడింది.


నిజానికి జల్సా స్పెషల్ షోలు పోకిరి రికార్డును భారీ తేడాతో బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. పోకిరి, జల్సా సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు వాటికి వచ్చిన స్పందనను చూస్తుంటే.. ప్రేక్షకులకి చిరంజీవి పాత సినిమాలు చూడాలనే ఆసక్తి లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇది చిరంజీవి స్టార్‌డమ్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పుకార్లకు చెక్ పెట్టాలంటే మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాలను బ్లాక్ బస్టర్ లుగా, గొప్ప విజయాలుగా నెలకొల్పి అందరి నోళ్ళు మూయించాలి.

READ  ఘరానా మొగుడు స్పెషల్ షోలు హిట్టా ఫట్టా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories