Homeసినిమా వార్తలుSookshmadarshini OTT Streaming Setails మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'సూక్ష్మదర్శిని' ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్ 

Sookshmadarshini OTT Streaming Setails మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘సూక్ష్మదర్శిని’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్ 

- Advertisement -

ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో రిలీజ్ అవుతున్న పలు సినిమాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ని కనబరిచాయి. ఆ విధంగా కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన మలయాళ మూవీస్ ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ అటు ఆ భాషతో పాటు ఇతర భాషల్లో కూడా ఆకట్టుకుని ఆడియన్స్ ని అలరించాయి. 

ఇక తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో రిలీజ్ అయి అక్కడి థియేటర్స్ లో అదరగొడుతున్న మూవీ సూక్ష్మదర్శిని. ఎం సి జితిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో దీపక్ పరాంబోల్, సిద్దార్థ భరతన్, అఖిల భార్గవన్ తదితరులు నటించారు. ​ఆకట్టుకునే కథ, కథనాలతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొంది ఆడియన్స్ ని అలరించింది.

విషయం ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్ మూవీ జనవరి 11 న ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఆడియన్స్ ముందుకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.   

READ  Pushpa 2 sets Big Benchmark in Book My Show బుక్ మై షోలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన 'పుష్ప - 2'

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories