Home సినిమా వార్తలు Balagam: ఒక్క నైజాంలోనే 20 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోన్న బలగం సినిమా

Balagam: ఒక్క నైజాంలోనే 20 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోన్న బలగం సినిమా

చిన్న సినిమా బలగం నైజాం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులు ఈ సినిమాను భారీ స్థాయిలో ఆదరించారు, అందుకే ప్రతి సెలవు రోజున భారీ వసూళ్లు రాబడుతూ ఈ సినిమా అద్భుతంగా ప్రదర్శితమవుతోంది.

ఇప్పటి వరకు నైజాంలో 12 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బలగం ఉగాది పండుగతో పాటు వచ్చే వారాంతంలో కూడా భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా ఈ సినిమా నిలకడైన ప్రదర్శన చూస్తుంటే నైజాం ఏరియాలోనే 20 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి టైర్-2 హీరోలకు కూడా ఈ ఘనత సాధించడం అంత సులువు కాదు. అలాంటిది చిన్న సినిమా అయిన బలగం ఆ మార్కును దాటితే ఇది భారీ విజయమనే చెప్పాలి.

చిన్నప్పటి ఎన్నో సంఘటనలను గుర్తు చేసుకునేలా ప్రేక్షకులను తమ నోస్టాల్జియాలోకి లాక్కు వెళ్ళింది ఈ సినిమా. పెళ్లి, చావు సమయంలో తెలంగాణ ప్రాంతాల్లో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను దర్శకుడు వేణు యెల్దండి చక్కగా తెరకెక్కించారు. ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా యొక్క రియలిస్టిక్ చిత్రణ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది, మరియు ఫలితంగా అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన లాంగ్ రన్ సాధించింది.

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్,మురళీధర్ గౌడ్, జయరామ్, రూప ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో దర్శకుడు వేణు, రచ్చ రవి సహాయక పాత్రలు పోషించారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version