గత కొన్ని రోజులుగా సంగీత దర్శకుడు థమన్ వారిసు, వీరసింహారెడ్డి సినిమాలకు విరామం తీసుకోకుండా తన పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మరియు అన్ని పనులను తగిన సమయానికి అందించడానికి చాలా కష్టపడుతున్నారు. అందుకే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కు హాజరు కాక పూర్తిగా స్టూడియోలోనే గడుపుతున్నారు.
వారిసు, వీరసింహారెడ్డి ట్రైలర్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కాస్త మిశ్రమ స్పందనను పొందాయి. కొన్ని షాట్లకు బీజీఎం లేదని ప్రేక్షకులు భావించారు. దానికి కారణం ట్రైలర్స్ కోసం థమన్ ప్రత్యేక ఏకాగ్రత ఇవ్వడానికి సమయం లేకపోవడమే. సాధారణంగా ఆయన ట్రైలర్లకు వేర్వేరు థీమ్స్ ఇస్తుంటారు.
విజయ్ నటించిన వారిసు ట్రైలర్ విడుదలయ్యే వరకు మంచి ఊపు మీదే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటర్ల కేటాయింపులో ఎలాంటి సమస్య రాకుండా చూసేందుకు దిల్ రాజు సపోర్ట్ కూడా ఉంది. అయితే ఇటీవల ఈ సినిమాకి చిన్న చిన్న సమస్యలు తలెత్తడం విజయ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
అంతే కాకుండా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పనుల విషయంలో జరుగుతున్న ఆలస్యం పై హీరో విజయ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రం విడుదల తేదీలలో అనేక మార్పులు జరిగాయి మరియు థమన్ వైపు నుండి కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో చాలా గందరగోళం ఏర్పడింది. ఈ సమస్యలన్నింటి వెనుక థమన్ అతిపెద్ద కారణం, ఎందుకంటే తన వైపు నుండి ఈ చిత్రానికి ఇంకా వర్క్ పెండింగ్ లో ఉంది, మరియు ఈ రోజు నాటికి ఆయన పని పూర్తవుతుందని వారు భావిస్తున్నారు.
తెలుగు, తమిళ వెర్షన్లను ఒకే రోజు విడుదల చేయడానికి వారసుడు చిత్ర యూనిట్ విశ్వప్రయత్నం చేసింది. కానీ వారు సరైన సమయంలో అన్ని పనులు పూర్తి చేయలేకపోవడంతో తెలుగు వెర్షన్ యొక్క విడుదల జనవరి 14 కి వాయిదా పడింది.
ఇక తమిళ వెర్షన్ కి కూడా ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. జనవరి 11 సాయంత్రం 6 గంటల కల్లా మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని భావిస్తుండటంతో ఓవర్సీస్ వద్ద ఈ ఆలస్యం కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే ఓవర్సీస్ దగ్గర షోలు ప్రారంభమవుతాయి. ఈ కారణంగా వారిసు ఓవర్సీస్ లో చాలా ప్రాంతాల్లో ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.