కోలీవుడ్ దర్శకుడు కం నటుడు ఎస్ జె సూర్య తెలుగులో 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్బస్టర్ తెరకెక్కించారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని మూవీ తీశారు. ఆపై పవన్ తో మరొక్కసారి ఆయన తీసిన పులి ఫ్లాప్ అయింది, అలానే నాని కూడా ఫ్లాప్ కావడం జరిగింది.
ఆ తర్వాత పూర్తిగా నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఎస్ జె సూర్య చివరగా 2015లో ఇసై అనే సినిమాని తానే స్వయంగా నటిస్తూ తెరకెక్కించారు. ఇక అక్కడి నుంచి నటుడిగా కొనసాగిన సూర్య అనేక సినిమాల్లో తన అత్యద్భుత యాక్టింగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం జనవరి 2025లో మళ్లీ తన డైరెక్షన్ ప్రారంభించనున్నారు సూర్య. త్వరలో ఆ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలైతే వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ద్వారా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్నారు. మరి అటు నటుడిగా ఇటు దర్శకుడిగా కొనసాగుతున్న సూర్య మరిన్ని సక్సెస్ లో ముందుకు కొనసాగాలని కోరుకుందాం