Homeసినిమా వార్తలుసత్యరాజ్ వల్లే సినిమా పోస్ట్ పోన్ అంటున్న శివ కార్తికేయన్

సత్యరాజ్ వల్లే సినిమా పోస్ట్ పోన్ అంటున్న శివ కార్తికేయన్

- Advertisement -

తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు ‘సీమ రాజా’, ‘రెమో’, ‘శక్తి’, ‘డాక్టర్’తో ఇది వరకే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఆయన ఇప్పుడు’జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) కావడం విశేషం. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మరియా హీరోయిన్ గా చేస్తుండగా, తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద బ్యానర్ లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు,పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ సినిమాకి “ప్రిన్స్” అనే టైటిల్ ను ఖరారు చేసారు. పక్కా ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవగా, ముందుగా వినాయక చవితి నాడు (ఆగస్ట్ 31) రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితే మళ్ళీ ఆ రిలీజ్ డేట్ మారినట్టు తెలిసింది, ఈ మేరకు హీరో శివ కార్తికేయన్, దర్శకుడు అనుదీప్ ఒక విడియో ద్వారా ఈ విషయాన్ని చెప్పారు.

ఈ వీడియోలో అటు శివ ఇటు అనుదీప్ ఇద్దరూ పంచ్ లతో నవ్వించారు. సినిమా రిలీజ్ కి కారణం ఎంటో చెప్పమని అనుదీప్ అడిగితే అందుకు బదులుగా శివ సత్యరాజ్ వల్లే ఈ సినిమా లేట్ అయిందని,ఇంతకు ముందు ఎంతో సరదాగా ఉండే ఆయన “బాహుబలి” తరువాత బాగా పొగరు ఎక్కింది అంటుండగా వెనుక నుంచి సత్యరాజ్ రావడం అంతా ఒక సినిమాలో సీన్ లాగా ఉండి నవ్వించింది.ఇక హీరోయిన్ మరియా వచ్చి తమిళ భాష సరిగా రాని అనుదీప్ తనకి తమిళ భాష నేర్పిస్తున్నారు అని చెప్పడం ఇలా వీడియో అధ్యంతం వీక్షకులను నవ్వించడం పనిగా పెట్టుకున్నారు. చివరిగా ఈ సినిమా వినాయక చవితి నాడు కాకుండా దీపావళి పండుగ సందర్భంగా విడుదల అవుతుంది అని ప్రకటించారు. తమిళ సినిమాల వరకు దీపావళి పండుగ బిగ్గెస్ట్ సీజన్ అనచ్చ్చు. మరి ఆ సీజన్ ను “ప్రిన్స్” క్యాష్ చేసుకుంటుందనే కోరుకుందాం.

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

YouTube Link

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories