Homeసినిమా వార్తలురికార్డ్ ధరకు అమ్ముడయిన శివకార్తికేయన్ ప్రిన్స్ నాన్ థియేట్రికల్ రైట్స్

రికార్డ్ ధరకు అమ్ముడయిన శివకార్తికేయన్ ప్రిన్స్ నాన్ థియేట్రికల్ రైట్స్

- Advertisement -

తమిళ యువ స్టార్ హీరో శివకార్తికేయన్, తెలుగు యువ దర్శకుడు అనుదీప్ కెవిల కలయికలో వస్తున్న ద్విభాషా చిత్రం “ప్రిన్స్”. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో, ట్రేడ్ వర్గాల్లో కూడా చాలా ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది.

శివకార్తికేయన్ వరుస విజయాలతో కెరీర్ లో మంచి ఊపు మీద ఉండటమే ఇందుకు కారణం. ఆయన నటించినగత రెండు చిత్రాలైన ” డాక్టర్”, ” డాన్” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా పంపిణీదారులకి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ విజయ పరంపర కొనసాగాలని ఆశిస్తూ ఉండగా.. అనుదీప్ కూడా ఇటీవల తన రచనలో వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత తనదైన శైలిలో తిరిగి గట్టి విజయం సాధించాలని చూస్తున్నారు.

ఇక మంచి అంచనాలు ఏర్పరచుకున్న ప్రిన్స్ సినిమా తాలూకు శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు భారీ ధరకు విక్రయించడంతో సినిమా వ్యాపారం చాలా గొప్పగా ప్రారంభమైంది. శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు కలిపి స్టార్‌ సంస్థకు 42 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి థియేట్రికల్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శివకార్తికేయన్‌కు ప్రస్తుతం హీరోగా ఉన్న బ్రాండ్‌ కారణంగా ఈ సినిమా తమిళనాడులో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంటుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. ప్రేక్షకులను అలరించే విధంగా ఆయన ఎప్పుడూ నిలకడగా కామెడీ ఎంటర్‌టైనర్‌లను అందిస్తూ వస్తున్నారు. ఆయన గత సినిమాల తరహాలోనే ప్రిన్స్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు శివకార్తికేయన్‌కి బలమైన జానర్ కాబట్టి, ఇక పబ్లిక్ టాక్ గనక పాజిటివ్‌గా ఉంటే, సినిమాని బ్లాక్‌బస్టర్ అవకుండా అపడం ఎవరి వల్లా కాదు.

READ  కష్టాల్లో ఉన్న పూరి జగన్నాధ్ కెరీర్

పైగా దర్శకుడు అనుదీప్‌కి ఉన్న క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రిన్స్‌కి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ కామెడీని పండించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. విపరీతంగా నవ్వించే ఆయన డైలాగులు, సినిమాను తెరకెక్కించే తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ప్రిన్స్ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ భారీ బిజినెస్ చేయడమే కాకుండా అందుకు తగ్గ లాభాలను కూడా అందించి బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సీతారామం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories