Homeసినిమా వార్తలుశివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

- Advertisement -

తెలుగు వర్ధమాన దర్శకుడు అనుదీప్ కెవి దర్శకత్వం వహించగా తమిళ ఇండస్ట్రీ యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రిన్స్ చిత్రం అక్టోబర్ 21, 2022న థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ చిత్రానికి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

కెరీర్ లో చక్కని దశలో ఉన్న శివ కార్తికేయన్ ఇలా ఒక చవకబారు తరహా ఇతివృత్తంతో సినిమా చేసినందుకు కాస్త ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కాగా ప్రిన్స్ చిత్రం 2016లో వచ్చిన పిట్టగోడ మరియు 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం జాతి రత్నాలు తర్వాత అనుదీప్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం. ఇక ఈ సినిమా శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫాం ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని తెలుస్తోంది. కాగా ప్రిన్స్ చిత్రం నవంబర్ 25, 2022 నుండి ఓటీటీలో ప్రసారం చేయబడుతుందని అంటున్నారు. ఆ రకంగా ధియేటర్ లో విడుదలైన ఐదు వారాలకు ప్రిన్స్ చిత్రం ఓటీటీలో విడుదల అవబోతుంది అన్నమాట.

READ  ఆటో ఇమ్యూన్ కండీషన్ తో బాధ పడుతున్న సమంత

ప్రిన్స్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, మరియు పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు.

ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సెకండరీ స్కూల్ టీచర్‌గా అన్బరసన్/ఆనంద్‌గా ప్రధాన పాత్రలో నటించారు, ఇందులో ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్కా అతని ప్రేమలో పడే జెస్సికా అనే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. వారి ప్రేమకు ఎలాంటి ఆటంకం కలిగింది? దాన్ని వారు ఎలా ఎదుర్కున్నారు అనే విషయాన్ని హాస్యంతో కూడిన కథనంతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అనుదీప్.

ఇక ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో సత్యరాజ్, ప్రేమి అమరన్, సతీష్ కృష్ణన్, సుబ్బు పంచు, ఆనందరాజ్, హలో కందసామి, భరత్ నటించారు.

ప్రిన్స్ రివ్యూలు మరియు బాక్స్ ఆఫీస్ వారీగా చూసుకుంటే రెండింటిలోనూ చాలా మోస్తరు స్పందన పొందింది. ఇదే సినిమాని ఒక తెలుగు హీరోతో తీస్తే బాగుండేదని, పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుగు ప్రేక్షకులు భావించారు. శివ కార్తికేయన్ తెలుగు దర్శకుడు అనుదీప్‌తో కలిసి పనిచేసినప్పుడు సరైన విధంగా ద్విభాషా చిత్రం చేసి ఉండాల్సిందని తమిళ ప్రేక్షకులు భావించారు. కనీసం ఓటీటీ రిలీజ్‌లోనైనా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేయాలని ఆశిద్దాం.

READ  కాంతార సినిమాని అప్పుడే ఓటీటీలో విడుదల చేయడం మంచిదేనా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories