Homeసినిమా వార్తలునిడివి తగ్గించుకున్న శివ కార్తికేయన్ ప్రిన్స్

నిడివి తగ్గించుకున్న శివ కార్తికేయన్ ప్రిన్స్

- Advertisement -

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన తాజా చిత్రం ప్రిన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉక్రేనియన్ నటి మారియా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ దీపావళి సందర్భంగా ప్రిన్స్ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. మొదట ఈ సినిమా నిడివి 2 గంటల 23 నిమిషాలుగా నిర్ణయించారు. అయితే తాజా వార్త ఏమిటంటే, చిత్ర బృందం సినిమా ఈ సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్ చేసారట. అందువల్ల ఇప్పుడు ప్రిన్స్ చిత్రం నిడివి 2 గంటల 11 నిమిషాలు అయింది. కాగా ఫస్టాప్ నిడివి 1 గంట 7 నిమిషాల 19 సెకన్లు అయితే సెకండాఫ్ నిడివి 1 గంట 3 నిమిషాలు మరియు 45 సెకన్లు ఉంటుంది.

ప్రిన్స్ ప్రచారం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ సౌత్ సినిమాల గురించి మాట్లాడారు. “ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, ద్విభాషా సినిమాలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి సినిమాలో విజయ్ హీరోగా చేస్తున్నారు, అలాగే రామ్ చరణ్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని ద్విభాషా చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఇటీవల సౌత్ సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార.. ఇలా ఎన్నో సినిమాలు విజయాలు సాధించాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీ వాళ్లు కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శివ కార్తికేయన్.

READ  హరీష్ శంకర్ - థమన్ తో కలిసి పని చేయాలని ఉంది - విజయ్ దేవరకొండ

ప్రిన్స్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాతో శివ కార్తికేయన్‌కు తెలుగులో సూపర్ హిట్ అందుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇంకొక్క రోజు ఆగాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories