Home సినిమా వార్తలు Siva Karthikeyan Joins Elite League రజనీ, విజయ్, కమల్ ఎలైట్ లీగ్‌లో చేరిన శివ...

Siva Karthikeyan Joins Elite League రజనీ, విజయ్, కమల్ ఎలైట్ లీగ్‌లో చేరిన శివ కార్తికేయన్

Amaran

కోలీవుడ్ యువనటుడు శివ కార్తికేయన్ నటుడిగా ఒక్కొక్క సినిమాతో తనదైన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో కెరీర్ పరంగా ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క మెప్పుతో అలరించే ఫిల్మోగ్రఫీతో కొనసాగుతున్నారు. ఇక తాజాగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.

శివ కార్తికేయన్ ఈ సినిమాలో అమర సైనిక వీరుడు వరదరాజన్ ముకుందన్ పాత్రలో తనదైన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో మరొకసారి ఆడియన్స్ ని అలరించారు. దీపావళి పండుగ సందర్భంగా రిలీజై తెలుగు తమిళ భాషల్లో విశేషమైన క్రేజ్ సంపాదించుకుని గడచిన మొత్తం 12 రోజుల్లో ఈ సినిమా రూ. 250 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

తన గత సినిమాల పరంగా చూస్తే శివ కార్తికేయన్ హైయెస్ట్ రూ. 120 కోట్లు మాత్రమే. అంటే అమరన్ సినిమా 11 రోజుల్లోనే ఆయన కెరీర్ లో డబల్ గ్రాస్ నైతే సంపాదించిందని చెప్పాలి. ఈ విధంగా తమిళనాడులో టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, విజయ్, కమలహాసన్ ల ఎలైట్ లిస్ట్ లో చేరారు శివ కార్తికేయన్. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే అమరన్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ 300 కోట్ల గ్రాస్ మార్క్ చేరేటువంటి అవకాశం కనబడుస్తోంది. దీని అనంతరం నటుడిగా మరింత మార్కెట్ ని సంపాదించుకోనున్నారు శివ కార్తికేయన్

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version