Homeసినిమా వార్తలుసీతారామం సినిమా ఒక వ్యసనం లాంటిది - హను రాఘవపూడి

సీతారామం సినిమా ఒక వ్యసనం లాంటిది – హను రాఘవపూడి

- Advertisement -

హను రాఘవపూడి దర్శకత్వంలోదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతా రామం సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. కాగా ఈ వేడుకకు ప్రభాస్ ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ఇక వేడుకలో సినిమా హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు హను రాఘవపూడి తమ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. అలాగే ప్రభాస్ ఒక గ్లోబల్ డార్లింగ్ స్టార్ అని కొనియాడారు. తాను ప్రాజెక్టు K లో కొన్ని సెట్స్ చూశానని.. తప్పకుండా ఆ సినిమా ఇండియన్ సినిమాను చేంజ్ చేస్తుంది అని నమ్మకంగా చెప్పారు. ఆ సినిమా కోసం ప్రేక్షకుల లాగే తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని దుల్కర్ అన్నారు.

సీతా రామం కథతో తాను చాలా కాలం పాటు ప్రయాణం చేశానని, ఆ ప్రయాణంలో భాగంగా వైజయంతి టీమ్ అందరూ తనకి కుటుంబ సభ్యులుగా మారిపోయారని దుల్కర్ అన్నారు. ఇక నిర్మాత అశ్విని దత్ గూర్చి చెప్తూ. ఆయన ఎల్లప్పుడూ నవ్వుతూ చిత్ర బృందానికి సహాయంగా ఉన్నారని అన్నారు.

READ  అంటే సుందరానికీ OTT రిలీజ్ కి కుదిరిన ముహూర్తం

దర్శకుడు హను రాఘవపూడి ఒక నిజమైన ఆర్టిస్ట్ అని.. మనసులో అనుకున్న దాన్ని అంతే అందంగా తెరపై తీసుకురాగల సమర్ధులని దుల్కర్ చెప్పారు. చిత్ర నిర్మాణ సమయంలో ఆయన చూపిన శ్రద్ధ తనకి ఎంతో నచ్చిందని, ఈ చిత్రంలో తాను పోషించిన పాత్ర తన కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండిపోతుందని అన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మృణాల్ ను తప్ప మరెవ్వరినీ ఊహించలేనని చెప్తూ.. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన సుమంత్ తనకి సోదరుడు లాంటి వాడు అని దుల్కర్ అన్నారు. అలాగే ఆగస్ట్ 5న విడుదల అవుతున్న ఈ చిత్రం చూసి ప్రేక్షకులు ఏమాత్రం నిరుత్సాహపడరని.. ఇది తన హామీ అని దుల్కర్ సల్మాన్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక దర్శకుడు హను రాఘవపూడి ఎన్నడూ లేనంత అత్న విశ్వాసంతో మాట్లాడారు.సాధారణంగా నేను ఈవెంట్లో మాట్లాడాలి అంటే భయపడుతూ ఉంటాను కానీ ఈరోజు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పిన ఆయన.. అందుకు కారణం సీతారామం సినిమా మీద పెట్టుకున్న నమ్మకమే అని చెప్పారు. అదే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు అసలు ఫోన్ ఏ చూడరు అని.. సినిమా అంతా కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఈ సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు తమకు బాగా కావాల్సిన వాళ్ళతో సమయం గడిపినట్లు అనుభూతి పొందుతారు అని ఆయన చెప్తూ.. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక వ్యసనంలా మారిపోతుందని, థియేటర్ లో ఓటిటి లో ఎక్కడైనా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేంత బాగుంటుందని హను రాఘవపూడి తెలిపారు.

READ  మహేష్ బాబు తో సందీప్ రెడ్డి వంగా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories