దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అద్భుత ప్రేమకథా చిత్రం అయిన సీతా రామం ఎట్టకేలకు OTT విడుదల తేదీని ఖరారు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 85+ కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ పొందిన ఈ చిత్రం అతి త్వరలో OTTలో విడుదల కానుంది.
మొదటి రోజు కాస్త సాధారణమైన కలెక్షన్స్‌తో ప్రారంభం అయిన ఈ చిత్రం తరువాతి రోజుల్లో అంచెలంచలుగా కలెక్షన్లను పెంచుకుంటూ వచ్చింది. దుల్కర్ – మృణాల్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి సహజమైన నటన కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంది. నెల రోజులుగా ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.
బాక్స్ ఆఫీసు వద్ద ఎదురే లేకుండా సాగిన థియేట్రికల్ రన్ తర్వాత, సీతా రామం అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రోజు నుంచే ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సీతా రామం తెలుగు, తమిళం మరియు మలయాళం భాషలలో అమేజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతుంది.
అయితే ప్రస్తుతం సీతా రామం తాలూకు హిందీ వెర్షన్ పోయిన వారం నుంచి ధియేటర్ లలో విడుదలైన నేపథ్యంలో.. హిందీ వెర్షన్ మాత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడదు, సెప్టెంబర్ 2న సీతా రామం హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అలాగే అక్కడి ప్రేక్షకులు మరియు విమర్శకులు ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 90 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడానికి దగ్గర్లో ఉంది.
సీతా రామం సినిమాలో దుల్కర్, మృణాల్ లతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హను రాఘవపూడి ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడుగా తన తొలి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రం ద్వారా మరో క్లాసిక్ చిత్రాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మనసులను కదిలించే సంగీతం అందించగా.. అవి తెర మీద కూడా అంతే అందంగా ఉండి సినిమాకి ప్రాణంలా నిలిచాయి.